Siraj: ఛాంపియన్స్ ట్రోఫీకి సిరాజ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ..! 1 y ago
ఇటివలే ఛాంపియన్స్ ట్రోఫీకి విడుదల చేసిన భారత క్రికెట్ జట్టులో సిరాజ్ కు చోటు దక్కలేదన్న విషయం తెలిసిందే. టోర్నమెంట్ ప్రారంభానికి ముందు సిరాజ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తాడనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. జస్ప్రీత్ బుమ్రా వెన్నునొప్పితో చికిత్స కోసం న్యూజిలాండ్ వెళ్లిపోతున్నాడు. దీంతో సిరాజ్ జట్టులో చేరే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. ఫిబ్రవరి 19 నాటికి బుమ్రా ఫిట్నెస్ పై స్పష్టత రానుంది.